Wednesday, December 25, 2024

కెసిఆర్ ఎక్కడున్నారో కెటిఆర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడున్నారో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పాలని టిపిసిసి ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ నుంచి బుధవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎలు 800 చెరువులు కబ్జా చేశారని, కబ్జాలు చేశారు కాబట్టే బిఆర్‌ఎస్ నేతలకు భయం పట్టుకుందని చురకలంటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, హైడ్రాకు ఏం సంబంధం లేదని మహేశ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తామని, డిపిఆర్ తయారుకానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో మూసీ ప్రక్షాళన చేసి ఆదుకుంటామని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చుతుందని, కానీ సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేశ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News