Monday, January 20, 2025

ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడుంది?

- Advertisement -
- Advertisement -

Where is largest Amazon campus in world?:Minister KTR

ట్విట్టర్లకు సండే క్విజ్ పేరిట
మరో ప్రశ్న సంధించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్.. ట్విట్టర్ సండే క్విజ్ అని సంబోధిస్తూ… ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడుంది? అని మరోసారి ట్విట్టర్ యూజర్లను మరోసారి ప్రశ్నించారు. గత గురువారం మంత్రి కెటిఆర్ ఓ ఫోటోను షేర్ చేసి.. ఇది ఎక్కడుందో చెప్పగలరా? అని ప్రశ్నించిన సంగతి విదితమే. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోటోను కెటిఆర్ నాడు షేర్ చేశారు. తాజాగా అమేజాన్ క్యాంపస్ భవనం చిత్రాన్ని కెటిఆర్ షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉంది? అని అడిగారు.

మరి ఈ క్యాంపస్ ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రామగూడకు వెళ్లాల్సిందే. అమెరికా ఇకామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనాన్ని హైదరాబాద్‌లో 2019లో ప్రారంభించింది. ఈ భవనాన్ని నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించారు. 15 అంతస్తుల భవనంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. దీనిని 21 ఆగస్టు, 2019న ప్రారంభించారు. ఈ క్యాంపస్ ద్వారా 9 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తోంది. అమేజాన్‌కు చెందిన వివిధ గ్లోబల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్స్ బ్యాకెండ్ కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఉద్యోగులు నిర్వహించనున్నారు. 2016, మార్చి 31న అమేజాన్ క్యాంపస్‌కు కెటిఆర్ శంకుస్థాపన చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News