Monday, December 23, 2024

పుష్ప ఎక్కడా..? పుష్ప గాడి రూల్..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రెండ్రోజుల క్రితం పుష్ప ఎక్కాడా? అని ఓ సస్పెన్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ముచ్చట తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేసింది. తాజాగా పుష్ప ఎక్కడున్నాడో తెలిసే వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియోను చూసిన బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పుష్ప పార్ట్ వన్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News