Monday, December 23, 2024

రాయితీ ఉల్లి తెలంగాణకు ఏదీ?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో కిలో రూ.25చొప్పున విక్రయాలు

కేంద్రం ప్రకటన

రాష్ట్రంలో తెరుచుకోని విక్రయ కౌంటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. తెలంగాణలోనూ ఉల్లి ధరలకు రెక్కలు మొలిచాయి. కిలో ఉల్లి రూ. 60కి విక్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణలో భాగంగా రాయితీపై ఉల్లిని కిలో 25రూపాయలకే పంపిణీ చే స్తున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రాంత వినియోగదారులు సైతం రాయితీ ఉల్లికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.తమకు కూడా రాయితీపైఉల్లిగడ్డలు అందజేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ఉల్లి విక్రయాల కౌంటర్లను ప్రారంభించలేదు.

ఖరీఫ్ లో ఉల్లి నాట్లు ఆలస్యం కావడం ,పంట దిగుబడి వచ్చేందుకు ఇంకా రెండు వారాలకు పైగానేసమ యం పట్టే అవకాశం ఉండటంతో దేశీయ మా ర్కెట్లో ఉల్లి ధరలు పెరిగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.65నుంచి80 వరకూ పలుకుతోంది.ఈ కామర్స్ సంస్థలు రిటైల్ స్టోర్లలో కిలో రూ.67 చొప్పున విక్రయిస్తున్నాయి. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు రాయితీపై పంపిణీ చేస్తోంది. కిలో రూ.25 సబ్సిడీ ధరకే టోకు, మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకూ 22రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల మె ట్రిక్ టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు.

ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ అధ్వర్యంలో ఉల్లి విక్రయాల కౌంటర్లు ఏర్పాటు చేయటంతోపాటుగా, వాహనాల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లిగడ్డలను వి నియోగదారలకు అందించే చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుం ది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800డాలర్లుగా నిర్ణయించింది. కిలో ఉల్లి కనీస ఎగుమతి ధర రూ.64.44 ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించింది. దేశీయంగా ఉల్లి గడ్డల నిల్వలు అందుబాటులో ఉంచడంతో ధరలను అదుపులో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం ఇందుకు సం బంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News