Monday, January 20, 2025

పంచన్ లామా ఎక్కడ ?

- Advertisement -
- Advertisement -

అమెరికాచైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్ లామా ఆచూకీని బీజింగ్ ప్రకటించాలని వాషింగ్టన్ డిమాండ్ చేసింది. సురక్షితంగా ఉన్నాడా లేదా ? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్‌లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ 11వ పంచన్ లామాగా ఎంపికైన బాలుడు గెధున్ చౌకీ నీమాను చైనా అపహరించి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ చిన్నారి టిబెట్ బుద్ధిజానికి చాలా కీలక వ్యక్తి. కిడ్నాప్‌కు గురయ్యే నాటికి ఆ బాలుడి వయసు ఆరేళ్లు.

నేటివరకు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. పంచన్ లామా వద్దకు ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఆ స్థానంలో మరో బాలుడిని తీసుకొచ్చింది. పీఆర్‌సీ అధికారులు తక్షణమే గెధున్ ఆచూకీ వెల్లడించాలి. అతడి మానవ హక్కులను కాపాడాలి. తక్షణమే బేషరతుగా పంచన్ లామాను విడుదల చేయాలి.” అని అమెరికా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. దలైలామా 1995 మే 14న ఆరేళ్ల బాలుడైన గెధున్ చోకీ నీమా పేరును 11వ పంచన్ లామాగా ప్రకటించారు. దీంతో చైనా ఆగ్రహం కట్టలు దెంచుకొంది. సరిగ్గా మూడు రోజుల తరువాత చైనా సైన్యం ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News