Monday, April 7, 2025

అమరావతిని గ్లోబల్ మెడికల్ కేంద్రంగా మార్చాలి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఐదేళ్లలో ఆసుపత్రులకు వచ్చిన డేటా ఆధారంగా..ఏ జిల్లాల్లో ఏ వ్యాధి ఎక్కువ అనే లిస్ట్ సిద్ధం చేశామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిని గ్లోబల్ మెడికల్ కేంద్రంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎస్సీడి సర్వే 2.0 జరిగిందని, ఇప్పుడు 3.0 జరుగుతోందని చెప్పారు. 8 లక్షల మంది బిపి, షుగర్ బాధితులు చికిత్స తీసుకోవడం లేదని, షుగర్ వ్యాధి స్త్రీలు, పురుషులకు సమానంగా వస్తుందని అన్నారు. ఆహారపు అలవాట్ల వల్లే షుగర్ ఎక్కువగా వస్తుందని, మగవారికి హైపర్ టెన్షన్ తక్కువ.. ఆడవాళ్లకు ఎక్కువని తెలియజేశారు. మహిళలు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారని అన్నారు.

ఎక్కడ రైస్ ఎక్కువ తింటారో అక్కడ డయాబెటిక్ ఉందని, వెనుకబడిన జిల్లాల్లో డయాబెటిక్ తక్కువగా ఉందని వెల్లడించారు. ఆడవాళ్లలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువని, లివర్ వ్యాధులు పురుషుల్లో ఎక్కువ.. అందుకు కారణం లిక్కర్ అని తెలిపారు. ఎపిలో మన్యం జిల్లాలో వ్యాధులు తక్కువగా ఉన్నాయని.. మంచి వాతావరణం, సాంప్రదాయ ఆహారం అందుకు కారణమని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో పలు ప్రయోగాలు చేస్తున్నామని, 19, 264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని, అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News