Sunday, December 22, 2024

రక్షణశాఖకు భూములు ఎక్కడ ఇవ్వాలి…?

- Advertisement -
- Advertisement -

7 జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలను
సేకరిస్తున్న హెచ్‌ఎండిఏ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ కారిడార్ల కోసం రక్షణ శాఖ నుంచి భూములను తీసుకుంటున్న హెచ్‌ఎండిఏ ఆ శాఖకు ఎక్కడ భూములు కేటాయించాలన్న విషయమై కసరత్తు చేస్తోంది. హెచ్‌ఎండిఏ పరిధిలోకి వచ్చే 7 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై ఇప్పటికే హెచ్‌ఎండిఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ రెండు కారిడార్లలో రక్షణ శాఖ భూములు 168.55 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరించనుంది. దీని ప్రకారం ఇతర ప్రాంతాల్లో 1,000 ఎకరాలకు పైనే అప్పగించాల్సి ఉంటుంది. తర్వాతే ఈ రెండు కారిడార్ల పనులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ క్రమంలోనే హెచ్‌ఎండిఏ అధికారులు భూముల అన్వేషణ కోసం రంగంలోకి దిగారు. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలోని హెచ్‌ఎండిఏతో పాటు ప్రభుత్వ భూములపై వారు దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News