Saturday, November 23, 2024

కొత్త కలెక్టరేట్‌లో ఏ శాఖ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం లో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గదులను కేటాయించారు. జీప్లస్‌టూ విధానంతో నిర్మించిన ఇం టిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంలో ఏ కార్యాలయం ఎ క్కడ ఉందో తెలుసుకోవడం కొంత కష్టమే. నాగర్‌కర్నూల్ పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపం లో 2017 అక్టోబర్ 1వ తేదిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. ఈ నెల జూన్ 6వ తేదిన రాష్ట్ర సిఎం కెసిఆర్ లాంచన ంగా ప్రారంభించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

సుమారు 12.30 ఎకరా ల్లో రూ. 52. 20 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణం జరిపారు. దాదాపు 99 గదులకు పైగా ఉన్న ఈ భవనాన్ని వివిధ బ్లాక్‌లతో వర్గీకరించారు.వీటిలో 42శాఖలకు కేటాయింపులతో అన్ని శా ఖలు సమీకృత కార్యాలయంలో కొలువు తీరా యి. కింది అంతస్తు జీ, మొదటి అంతస్తు ఎఫ్, రె ండవ అంతస్తు ఎస్‌లో గదుల కేటాయింపులు జ రిపారు. ప్రవేశ మార్గం నుంచి వస్తే ఏ శాఖకు ఎటు వైపు వెళ్లాలో వివరిస్తూ జిల్లా సమాచార పౌర సంబ ంధాల శాఖ అందిస్తున్న సమాచారత్మక కథనమిది.

* కింది అంతస్తు జి లో
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జీ అంతస్తులో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు గదుల కే టాయింపు జరిపారు. ఇందులో రూమ్ నెంబర్ జి 1లో జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయాన్ని, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయాన్ని, జి2లో ఏటిఎం, జి3లో షాప్, జి4లో కా ర్మిక శాఖ, జిల్లా వయోజన విద్య, తూనికలు, కొలతలు శాఖల కార్యాలయాలకు కేటాయించారు. జి 5 ఎన్‌ఐసి జాతీయ వీడియో కాన్ఫరెన్స్ హాల్, జి6 ను జిల్లా మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వ యోవృద్ధుల కార్యాలయానికి కేటాయించారు. రూ ం నెం. జి7లో సర్వే, భూ రికార్డుల అధికారి కార్యాలయం, జి8ను కలెక్టరేట్ ఈ, డి విభాగాల కోసం, జి9లో కలెక్టరేట్ రికార్డు గది, 12,13లో జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయం, జి16 సర్వర్ రూం, 17 జిల్లా మైనింగ్ కార్యాలయానికి, 18 ఎ లక్ట్రికల్ రూం, జి19 జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాంబర్, జి 20 స్టోర్ రూం, జి21 కలెక్టరేట్ విభాగాలు, 22 అటెండర్స్ రూమ్, 23 కలెక్టరేట్ ప రిపాలన అధికారి ఛాంబర్, జి24 కలెక్టరేట్ విభాగాలు, జి25 స్టోర్ రూం, జి26 అదనపు కలెక్టర్ రె వెన్యూ ఛాంబర్, జి 27 అదనపు కలెక్టరేట్ రెవె న్యూ సిసి ఛాంబర్, జి30 సర్వర్ రూం, జి31 ఎలక్ట్రికల్ రూం, జి32 స్టోర్ రూం, జి33 కలెక్టరేట్ ఇ న్‌వార్డ్, అవుట్ వార్డు జిల్లా ఎలక్షన్ విభాగం, జి3 6 ప్రధాన మీటింగ్ సమావేశ మందిరం, ప్రజావా ణి హాల్, జి 37 జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చే ప్రజలకు వెయిటింగ్ హాల్, జి38 అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సిసి ఛాంబర్, జి39 అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఛాంబర్, జి40 మినీ కాన్ఫరెన్స్ హాల్, జి41 కలెక్టరేట్ పిఏ గది, జి42 జిల్లా కలెక్టర్ ఛాంబర్, ఇతర సదుపాయాలను ఏర్పరిచారు. అదే విధంగా ఒకటి,రెండు అంతస్తులు ప్రత్యేక స మావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జిల్లా పర్యటనకు వచ్చే మంత్రుల కోసం కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో ప్రత్యేకంగా గదులను కేటాయించారు.

* మొదటి అంతస్తులో
సమీకృత కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో ఎఫ్1 నెంబర్ రూంను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్‌డిఓ, స్త్రీనిధి, స్టాఫ్‌కు, ఎఫ్2 గదిని కార్యనిర్వహక ఇంజనీర్, మిషన్ భగీరథ ఇంట్రా అధికారి, ఎఫ్ 3,4లను జిల్లా పంచాయతి శాఖ అధికారి కార్యాలయానికి, 5ను జిల్లా పంచాయతి రాజ్ ఇంజనీరిం గ్ అధికారి కార్యాలయం, 8ని జిల్లా పరిశ్రమల కా ర్యక్రమాలకు, 11ను ఎలక్ట్రికల్ పరికరాలకు, ఎఫ్ 12ను కాన్ఫరెన్స్ హాల్‌గా, ఎఫ్14, 15ను జిల్లా వి ద్యాశాఖ అధికారి సమగ్ర శిక్షణ కార్యాలయానికి, ఎఫ్ 16 వంటగది, 17ను జిల్లా మద్య నిషేద, ఆబ్కారీ శాఖకు, 18,19లను జిల్లా పౌర సరఫరా ల శాఖకు, 25ను జిల్లా పే, అకౌంట్స్ కార్యాలయ ం, జిల్లా ఖజానా శాఖకు, 26ను జిల్లా వ్యవసాయ, సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ శాఖకు, 27ను జిల్లా గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖకు, 28ని జి ల్లా సహకార సంఘాల శాఖకు, స్టేట్ ఛాంబర్ జి ల్లాకు వచ్చే మంత్రులు వినియోగించేందుకు కేటాయించారు.

* రెండవ అంతస్తులో
సమీకృత కలెక్టరేట్‌లోని రెండవ అంతస్తులో వివిధ శాఖలకు గదుల కేటాయింపు జరిగింది. రెండవ అంతస్థులోని ఎస్1 గదిని జిల్లా షెడ్యుల్డ్ కులాల అధికారి ఎస్సి కార్పొరేషన్‌కు, ఎస్2,3లను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖకు, 4ను మత్సశాఖ కార్యాలయానికి, 8ని కాన్ఫరెన్స్ హాల్‌గా, ఎస్ 10ను జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయానికి, ఎస్ 13, 14 గదులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖకు, 15,16 గదులను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి, ఎస్17ని జిల్లా రోడ్డు, భవనాల శాఖ కార్యాలయానికి, 18వ గదిని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి కార్యాలయానికి, 19,20లను జిల్లా ఆడిట్ అధికారి కార్యాలయానికి, 25వ గదిని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖకు, 26,27,28లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లిన అక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం నూతన కలెక్టరేట్ భవనంలో అవసరమైన ప్రాంతాల్లో టాయిలెట్స్ ఏ ర్పాటు చేశారు. విశాలమైన రహదారులు, పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని శాఖల జిల్లా కార్యలయాలు కొలువుతీరాయి.

* స్వచ్ఛత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
పరిపాలన సౌలభ్యం, ప్రభు త్వ పాలనకు ప్రజలకు చేరు వ చేయాలనే ఉద్దేశంతో రా ష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్ర ంలో సమీకృత కలెక్టరేట్‌ల ను నెలకొల్పింది. అధునాత న సౌకర్యాలు, సకల హం గులతో ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పా టు చేసింది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అంతే జవాబు దారీతనంగా సేవలందించే ందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృతనిశ్చయంతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. నూతన ఉత్సాహంతో ప్రతి ఉద్యోగి నిస్వార్థంగా సేవలు అందించి జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందాలి. నూతన సమీకృత కా ర్యాలయాన్ని స్వచ్ఛత పరిశుభ్రంగా ఉంచేందు కు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనుల అవసరాలకు వచ్చే ప్రజలు కూడా కార్యాలయ పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News