Thursday, January 23, 2025

సైక్లింగ్ లేదా స్కిప్పింగ్..బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

- Advertisement -
- Advertisement -

బరువు తగ్గించే ప్రయత్నంలో ప్రతిరోజు చాలా మంది వ్యక్తులు సైక్లింగ్ లేదా స్కిప్పింగ్ చేస్తుంటారు. కొందరు అయితే జిమ్ కూడా వెళ్తారు. మరికొందరు అయితే ఇంటి వద్దనే వర్క్ ఔట్స్ చేస్తుంటారు. అయితే బరువు తగ్గడంతో సైక్లింగ్ లేదా స్కిప్పింగ్ ఎంపికను ఎంచుకోవడం విషయానికి వస్తే, చాలా మంది కన్ఫ్యూజన్ ఐతారు. ఒకవేళ మీరు కూడా కూడా అదే గందరగోళాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఈ వార్త మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సైక్లింగ్, స్కిప్పింగ్ లో ఏది ఉత్తమంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సైక్లింగ్

సైక్లింగ్ అనేది కాళ్లు, తుంటిని బలపరిచే గొప్ప వ్యాయామం. ఒక గంట సైక్లింగ్‌లో దాదాపు 400-600 కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇది బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే సైక్లింగ్ కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో ఆర్థరైటిస్ లేదా ఇతర కీళ్ల సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది సురక్షితంగా ఉంటుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మానసిక స్థితి మెరుగుపడి, మరింత శక్తివంతంగా ఉంటారు.

 

స్కిప్పింగ్

జంపింగ్ రోప్ లేదా స్కిప్పింగ్ అనేది శరీరాన్ని ఉత్తేజపరిచే బెస్ట్ వ్యాయామం. ఇది కడుపు, కాళ్లు, తుంటిని టోన్ చేయడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఒక గంట స్కిప్పింగ్ చేయడం వల్ల దాదాపు 800-1000 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే, కీళ్ల సమస్యలతో బాధపడేవారు కీళ్లపై కలిగించే ఒత్తిడి కారణంగా స్కిప్పింగ్‌కు దూరంగా ఉండాలి.

 

ఏ వ్యాయామం మంచిది?

సైక్లింగ్, స్కిప్పింగ్, రెండూ బరువు తగ్గడానికి ఉత్తమ వ్యాయామాలు. అయితే, మీకు ఏది మంచిది అనేది మీ వ్యక్తిగత ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సైక్లింగ్ అనేది తక్కువ-ప్రభావ వ్యాయామం. ఇది శరీరంపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. నెమ్మదిగా, సురక్షితంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక. మరోవైపు.. స్కిప్పింగ్ అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. వేగవంతమైన ఫలితాలను చూపుతుంది. అయితే శారీరకంగా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News