Wednesday, January 22, 2025

మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది ఉత్తమ?

- Advertisement -
- Advertisement -

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలి?
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ కదలికలను లోతుగా అధ్యయనం చేయలేని వారు, అధిక మార్కెట్ రాబడిని పొందాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల మ్యూచువల్ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదారుల సమయం, పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ రెండూ చాలా ప్రజాధరణ పొందినవి. ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, ప్రతికూలకతలు ఏమిటి? వీటిలో ఏ రకమైన పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేయాలి? ఈ రెండు మ్యూచువల్ ఫండ్ల మధ్య సారూప్యతలు, తేడాలు ఏమిటి? తెలుసుకుందాం.

ఈ రెండూ విభిన్నమైనవి..
ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఈ రెండు మ్యూచువల్ ఫండ్‌లు విభిన్న పోర్ట్‌ఫోలియో ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే అన్ని రకాల మార్కెట్ క్యాప్‌ల షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తారు. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే మూడు రకాల షేర్లను పొందుతారు. అయితే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద పరిమితి ఏమిటంటే, ఈ ఫండ్స్ ఈక్విటీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే అటువంటి మ్యూచువల్ ఫండ్‌లు మీకు ఈక్విటీ పరిధిలో మాత్రమే విభిన్నమైన పోర్ట్‌ఫోలియో ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పరిధి విస్తృతమైనది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఈక్విటీ, డెట్ సాధనాలు రెండూ ఉన్నాయి.

మీకు ఏది మంచిది?
ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనే రెండు రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలి. విశ్లేషకులు ఈ రెండు ఫండ్‌లు తమదైన రీతిలో సరైనవని అంటున్నారు. మీకు ఏది మంచిది అనేది మీ ప్రత్యేక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

రిస్క్, రిటర్న్ ఆధారంగా ఎంచుకోండి
మీరు తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే, మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మంచి ఎంపికగా చెప్తారు. మార్కెట్‌లో ఆకస్మిక హెచ్చుతగ్గులు ఏర్పడినప్పటికీ ఈ ఫండ్‌లు తక్కువగా ప్రభావితమవుతాయి. అయితే వీటిలో రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఫ్లెక్సీ ఫండ్స్‌తో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ అత్యధిక రాబడిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సంక్షిప్తంగా ఫ్లెక్సీ ఫండ్స్ రిస్క్-తీసుకునే పెట్టుబడిదారులకు మంచి ఎంపిక, అయితే పెట్టుబడి భద్రతను ఇష్టపడే పెట్టుబడిదారులకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉత్తమం అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News