Wednesday, January 22, 2025

గదులుండగా…. గ్రౌండ్‌లో బోధన!

- Advertisement -
- Advertisement -
  • బోర్డు లేకుండా బోధిస్తున్న గణిత ఉపాధ్యాయుడు
  • రోడ్డు పక్కనే బోధించడంతో దృష్టి పెట్టని విద్యార్థులు
  • ఇష్టానుసారంగా బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్

పెద్దేముల్: బ్రహ్మాండమైన తరగతి గదులు ఉండగా.. ఆ ఉపాధ్యాయుడు రోడ్డుకు ప్రక్కనే కనీసం 10 మీటర్లు కూడా లేని వరండల్‌లో విద్యార్థులను కూర్చోబెట్టి విద్యాబోధనలు చేస్తున్నారు. ఫలితంగా కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ‘విద్యార్థులు గణితం నేరిస్తేంటి.. నేర్చుకోకపోతేంటి.. నా స్టైల్ నాదే అన్నట్లుగా ఆ ఉపాధ్యాయుడు వ్యవహరిస్తున్నాడు.

పూర్తి వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మీడియం ఉంది. పాఠశాలలో ఆయా తరగతులకు సంబంధించి మొత్తం 9 తరగతి గదులు ఉన్నాయి. పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయు డు తరగతి గదిలోనే బోధన చేస్తున్నారు. కానీ, గణిత ఉపాధ్యాయుడు శ్రీధర్ మాత్రం ఇందుకు భిన్నంగా విద్యా బోధన చేస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాడు.

పాఠశాలలో తరగతి గదులు బాగున్నప్పటికీ.. బయటే విద్యాబోధనలు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. బోర్డుపై లెక్కలు చేప్తేనే అర్థం కాని పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ గణిత ఉపాధ్యాయుడు మాత్రం పాఠశాల గ్రౌండ్‌లో బోధన చేయడం వల్లన గణితంలో వెనకబడిన విద్యార్థులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రతిరోజు రోడ్డు ప్రక్కనే గల గ్రౌండ్‌లో బోధిస్తున్నాడు.

శుక్రవారం సైతం రోడ్డుకు కనీసం 10 మీటర్ల దూరం కూడా లేని ప్రదేశంలో పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులు ఇబ్బందులు ఇబ్బందు లు పడుతున్నారు. ఇక్కడ సంగారెడ్డి ప్రధాన రహదారి కావడంతో రోడ్డుపై వా హనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. వాహనాల శబ్ధం ఒకవైపు.. మరోవైపు బోర్డు లేకుండా బోధన చేయడం ద్వారా విద్యార్థులు గణితంపై పట్టుకోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సీతయ్యలాగా నా మాటే శాసనమన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.

ఇదే విషయాన్ని ఉపాధ్యాయుడి వివరణ కోరగా.. ఎక్కడ కూర్చోబెట్టరాదా..? ప్రాబ్లం ఏంటంటూ విద్యార్థులుల నష్టపోయేలా ఎదురు ప్రశ్నలు వేసి దాటవేశాడు. ఈ ఉపాధ్యాయుడి తీరుతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రౌండ్‌లో కాకుండా తరగతిలో బోధన చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News