Monday, December 23, 2024

మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో విప్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల ప్రతినిధి: అక్టోబరు 1న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల పర్యటన నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని పార్టీ బీ1 క్యాంపు కార్యాయలం, తన స్వగృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మున్సిపాలిటీ నాయకులు, పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమాన్ని కార్యాచరణ ప్రకారం సమయానికి జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News