పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాలోని ‘విజిల్’ సాంగ్‌ను బుధవారం ప్రముఖ కథానాయకుడు సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో లిరికల్ వీడియో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రామ్ పోతినేని మాట్లాడుతూ “దేవిశ్రీ ప్రసాద్ ‘విజిల్’ సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు. సినిమాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. ‘విజిల్’ సాంగ్ షూట్ చేసేటప్పుడు ’ది వారియర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమైంది.
దర్శకుడు లింగుస్వామి సినిమాలోని ప్రతి ఫ్రేమును అద్భుతంగా తెరకెక్కించారు”అని అన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “అద్భుతమైన సందర్భంగా ‘విజిల్’ పాట వస్తుంది. సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు అందరూ పెద్ద పెద్ద విజిల్స్ వేస్తారు. రామ్ స్పెషాలిటీ ఏంటంటే… స్కిప్ట్ విన్న రోజు నుంచి సినిమా పూర్తయిన తర్వాత చూసే వరకూ ఎనర్జీ లెవల్ ఎక్కడా తగ్గలేదు. ఆయన నెక్స్ లెవల్ హీరో” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కృతి శెట్టి, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, సుజీత్ వాసుదేవన్, సాహితి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Whistle Lyrical Song out from ‘The Warrior’