Thursday, November 21, 2024

గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనను ఖండించిన వైట్‌హౌస్

- Advertisement -
- Advertisement -

White House condemned demolition of Gandhi statue

 

వాషింగ్టన్: కాలిఫోర్నియాలోని డేవిస్ నగరంలో ఇటీవల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని వైట్ హౌస్ సోమవారం ఖండించింది. మహాత్మా గాంధీ స్మృతిచిహ్నాలను అపవిత్రం చేయడం పట్ల తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి జెన్ సకి విలేకరుల సమావేశంలో తెలిపారు. డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో నాలుగేళ్ల క్రితం ప్రతిష్టించిన ఆరు అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత నెలాఖరులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ఈ సంఘటనను తాము ఖండిస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News