Wednesday, December 25, 2024

బైడెన్ ఆరోగ్యంపై విమర్శలకు వైట్‌హౌస్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై అనుమానాలు పడే రీతిలో అనేక వీడియోలు వెలువడుతున్నాయి, దీనిపై వైట్‌హౌస్ తాజాగా స్పందించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేతల వైఖరిని విమర్శించింది. “రిపబ్లికన్లు ఎంత నిరాశతో ఉన్నారో ఈ ఫేక్ వీడియోలు రుజువు చేస్తున్నాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ విమర్శించారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు బైడెన్ హాజరయ్యారు.

మిగిలిన ప్రపంచ నేతలంతా ఒకవైపు ఉంటే బైడెన్ మాత్రం మరోవైపు తిరిగి, ముందుకు వెళ్లడమే కాకుండా ఎవరితోనోమాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ వీడియోలో అటువైపు ఎవరూ లేరు. ఇంతలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనను మిగతా నేతలంతా ఉన్న దగ్గరికి తీసుకువచ్చారు. దీనిపై ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఇతరులతో మాట్లాడేందుకు బైడెన్ అటువైపు వెళ్లారని చెప్పారు. కన్జర్వేటివ్ మీడియా కూడా దీనిని ఫ్యాక్ట్ చెక్ చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News