Monday, December 23, 2024

ప్రెసిడెంట్ ఒబామా.. తప్పుచెప్పి సారీ చెప్పిన వైట్‌హౌస్ లేడీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికార ప్రతినిధి మహిళ కరైన్ జీన్ పెర్రీ మాట దొర్లింది. ప్రెస్‌మీట్ సందర్భంగా దేశ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అని చెప్పడంతో విలేకరులు ఒక్కసారిగా అరుపులకు దిగారు. వెంటనే తేరుకున్న ఈ ప్రతినిధి సారీ ప్రెసిడెంట్ బైడెన్ అంటూ తన రోజువారి సమాచార వివరాలు వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా అమెరికా తరఫున అజయ్ బంగా పేరును ప్రెసిడెంట్ బైడెన్ ప్రతిపాదించినట్లు తెలిపేందుకు వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు అయింది.

ఈ క్రమంలో బైడెన్ బదులు ఈ లేడీ ఒబామా అని చెప్పడం ఇది ప్రత్యక్ష ప్రసారం కావడం క్షణాలలో జరిగిపోయింది. పొరపాటుకు చింతిస్తున్నట్లు తెలిపిన ఈ ప్రతినిధి మనం అమెరికన్లం వెనకకు కాదు ముందుకు పోతున్నామని చెప్పి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. చాలాకాలంగా వైట్‌హౌస్ ప్రతినిధిగా ఉన్న క్రమంలో ఆమె ఈ మాటతడబాటుకు దిగి ఉంటారని కామెంట్లు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News