- Advertisement -
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు.. ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని కోరారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందన్నారు. శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదన్నారు. శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉందని తప్పబట్టారు. శ్వేతపత్రాన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదన్న హరీశ్ రావు ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారులతో తప్పుడు నివేదికలు తయారు చేయించారని సూచించారు.
- Advertisement -