Tuesday, December 24, 2024

ధరణిపై త్వరలో శ్వేతపత్రం

- Advertisement -
- Advertisement -

రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ

ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం

ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం

సిఎం పదవిపై ఆశ లేదు

విలేకరులతో రెవెన్యూ మంత్రి పొంగులేటి చిట్ చాట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐదు ఎకరాల వరకు రైతుబం ధు నగదును ఈ రెండు రోజు ల్లో జమ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మంత్రి పొంగులేటి విలేకరులతో గురువారం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఏ దీ రహస్యం లేదన్నారు. త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ధరణి అక్రమాలను వివరాలతో సహా బయటపెడతామని ఆయన చెప్పారు. ధరణికి సంబంధించి తన వద్ద మరిం త సమాచారం ఉందన్నారు. కోదండ రెడ్డి చె ప్పిన దానికంటే ధరణిలో ఎక్కు వ అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు. ధరణిలో ఉపయోగ పడే అంశాలను ఉంచుతామని, దాని స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకొస్తామని ఆయన తెలిపారు. ధరణితో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శాఖలో రెండు సంవత్సరాలు దాటిన అధికారులను మొత్తం బదిలీ చేస్తామన్నారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ఫలితం ఎవరికీ దక్కిందో అందరికీ తెలిసిందేనన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదన్నారు. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదని మంత్రి పొంగులేటి అన్నారు. తాము అధికారం చేపట్టిన రెండు,మూడు రోజుల్లోనే పవర్ షట్‌డౌన్ చేయాలని కొందరు అధికారులు, ప్రతిపక్ష నాయకులు ప్లాన్ చేశారని ఆయన మండిపడ్డారు. దానిని తాము అధిగమించామని, ఆ పరిస్థితుల నుంచి తాము బయట పడ్డామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపి సీట్లు గెలవబోతుందన్నారు. తెలంగాణలో 14 ఎంపి సీట్లు ఈజీగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఒకటి రెండు ఎంపి సీట్లు గెలిస్తే గొప్ప అనుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. డిసెంబర్‌లోనే రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందని, కానీ, చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్ష నాయకులు బాధ్యత విస్మరించి తమపై రాళ్లేయడం తగదన్నారు. జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫొటోలు, వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

పార్టీలోకి ఎవరిని తాము రమ్మని అడగడం లేదు
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, మాకు ఎంఐఎం మద్దతు తెలపుతుందన్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని వారే స్వచ్ఛందంగా వస్తున్నారన్నారని ఆయన తెలిపారు. తాము గేట్లు ఎత్తలేదని, ఎత్తితే వరద ఆగదని, తాము చెప్పిందే చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే దెబ్బతిన్న వ్యవస్థను దారిలో పెడుతున్నామన్నారు. జీతాల చెళ్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. తాను బిజెపితో టచ్‌లో ఉన్నానని అనడం కరెక్ట్ కాదన్నారు. బిజెపిలో ఎవ్వరితో తాను టచ్‌లోకి వెళ్లలేదుదని, అదంతా ప్రచారమని ఆయన తెలిపారు. ప్రధానిని కలిస్తే పొల్యూట్ అయినట్టు కాదన్నారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అని తనను ట్రోల్ చేస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News