Sunday, December 22, 2024

ఆర్థిక విధ్వంసం పైనే శ్వేతపత్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఆర్థ్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశానికి సంబంధించి అసెంబ్లీలో వాడివే డి చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారన్నారు. అందరి నీ ఒ ప్పించే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గు ర్తుచేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని ప్ర జలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రమని ఆయ న తెలిపారు. నిధులు ఎలా వచ్చాయి? ఎ లా దారి మళ్లాయో? అనేది తెలియాలని చె ప్పారు. దేశంతో తెలంగాణ పోటీపడాలనే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. సభ్యులంతా మంచి సూచనలు ఇచ్చారని ఆర్థిక పరిస్ధితి ఓ వైపు, ప్రజల ఆకాంక్షలు మరోవైపు ఉన్నాయన్నారు. మన ముందు పెద్ద సవాల్ ఉంది ఉందని, ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బట్జెట్ లేదని, బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర సంస్థలు ఏం తీసుకురాలేదని, వచ్చిన ఐటిఐఆర్‌ను పొగొట్టారని విక్రమార్క ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు. ప్రజలందరికీ చూపించారని ఆయన చురకలంటించారు. ఎన్నికల కంటే ముందే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిందని, పదేళ్లలో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారని భట్టి ప్రశ్నించారు. మేం వెళ్లి మేడిగడ్డ చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారని, మేడిగడ్డను మళ్లీ కట్టాలని ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని తెలిపారు. రెండు ఫాంహౌజ్‌లను మాత్రం తెచ్చారని, మీరు కట్టిందే ఓ ప్రాజెక్ట్, అది కూడా కూలిపోయిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంపై మీకంటే మాకే ఎక్కువ ప్రేమ వుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది తామేనని, దానిని కూడా మీరు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్పోరేషన్‌లు అప్పులు తీర్చవని, ప్రభుత్వమే అప్పు తీర్చాలన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఒడి తీసుకోవాల్సిన పరిస్ధితి వుందని, తెచ్చిన అప్పులతో బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారా? అంటే అదీ లేదన్నారు. ఆర్ధిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారని, గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ టాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పిందని తెలిపారు. ఇంతచేసి బయటకు చెప్పకండి, పరువు పోతుందంటున్నారని ఆయన మండిపడ్డారు.

మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారని ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 14 శాతం ఉన్న రుణభారం ఇప్పుడు 34 శాతానికి పెరిగిందని తెలిపారు. ఓఆర్‌ఆర్ కట్టింది తామేనని, దానిని కూడా అమ్మకానికి పెట్టారని ఎద్దేవా చేశారు. బహిరంగ మార్కెట్ కంటే వడ్డీ ఎక్కువని, మీరు చేసిన దివాళ పని సెట్ చేసుకోవడం మాకు కష్టమేనని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక అరాచకత్వం ఎంతగా వుందంటే అప్పు కట్టడానికి కూడా అప్పు తేవాల్సిన పరిస్ధితి వుందన్నారు. ఎపి కేడర్‌కు కేటాయించిన అధికారులను సిఎస్, డిజిపిలుగా చేశారని దుయ్యబట్టారు. పాదయాత్ర చేసినప్పుడు అందరూ స్వేచ్ఛలేదనే చెప్పారని, పదేళ్లలో ఎప్పుడైనా సభలో ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. మాకు కిరీటాలు వచ్చాయని అనుకోవడం లేదని, ఇప్పుడు కడియం శ్రీహరితో పాటు 4 కోట్ల మంది ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు. తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News