Sunday, December 22, 2024

అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి….

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /పాల్వంచ రూరల్ : ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకొన్న తెలంగాణాలో జరిగిన అభివృద్ధిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిఎస్‌పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. మండల పరిధి రాజాపురం, యానంబైల్, సత్యనారాయణపురం, కారెగట్టు గ్రామాలలో ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి బిఎస్‌పి జెండా పండుగ నిర్వహించారు. యెర్రంశెట్టి రాజేశ్వరి ఆధ్వర్యంలో కామేష్ బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ …పోరాటాలు, ఆత్మబలిదానాలతో సాధించుకొన్న తెలంగాణాలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.

Also Read: చంద్రబాబుకు హై టెన్షన్

అనేక మోసపూరిత వాగ్దానాలతో తిరిగి అధికారంలోకి రావటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని అలాంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లేకుంటే గోస పడతామని హెచ్చరించారు. అభివృద్ది జరిగింది ప్రజలు, గ్రామాలు కాదని నాయకులు మాత్రమే అభివృద్ది చెందారని విమర్శించారు. కొత్తగూడెం నియోజక వర్గంలో వేల కోట్ల అభివృద్ది జరిగిందని గొప్పలు చెప్పుకొనే వారు దమ్ముంటే చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎంఎల్‌ఏ తన అనుచర వర్గం చేస్తున్న అరాచకాలకు త్వరలోనే చరమగీతం పాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తోట వెంకన్న, మొహమ్మద్ ముంతాజ్, కాకటి శైలజ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News