Monday, December 23, 2024

తెల్ల రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావా?

- Advertisement -
- Advertisement -

ప్రజాపాలన కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికే లక్ష్యంగా ప్రజలనుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ పథకాలు వర్తించాలటే దరఖాస్తు ఫారానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలను జత చేయడం తప్పనిసరి.

అయితే రేషన్ కార్డు లేనివారి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న ఇప్పుడు అనేకమందిని వేధిస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే పథకాల వర్తింపు కష్టమని అన్నారు. అయితే రేషన్ కార్డులు లేనివారికి కొత్తగా కార్డులు జారీ చేస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News