హైదరాబాద్ : అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రంలో తెల్లతోక జింకల్లో సార్స్ కొవిడ్ 2 వైరస్ అత్యధికంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ తాలూకు ఆర్‌ఎన్‌ఎ ( ఆర్ఎన్ఎ) ఈ జింకల్లో కనిపిస్తోంది. 2020 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సేకరించిన జింక నమూనాలు 2700 లో 17, 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సేకరించిన 2762 నమూనాల్లో 583 ఆర్‌ఎన్‌ఎలు కనిపించాయి. ఈ వైరస్ లోని ఆల్ఫా, డెల్టా, గామా రకాలను పరిశోధకులు కనుగొన్నారు. మొదట మనుషుల్లో ఇవి కనిపించిన తరువాత జింకలకు సంక్రమించడం గమనార్హం. ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం ఏమంటే తెల్లతోక జింకల నుంచి సేకరించి వైరస్ జన్యు సరళి మనుషుల నుంచి సేకరించిన సార్స్ కొవిడ్ 2 జన్యుసరళి కంటే చాలా విభిన్నమైనది కావడం విశేషం. దీన్ని బట్టి తెల్లతోక జింకల్లో వైరస్ వేగంగా గ్రహించ బడుతోందని తెలుస్తోంది. ఆల్ఫా, డెల్టా వైరస్ సంతతి మనుషుల నుంచి తెల్లతోక జింకలకు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.
ఈ విధమైన మార్పు చెందిన వైరస్ జంతువుల నుంచి జింకలకు, మనుషుల నుంచి జింకలకు ఎలా వ్యాప్తి చెందుతోందో తెలుసుకోవలసి ఉంది. మనుషుల్లో సార్స్ కొవిడ్ 2 వ్యాప్తి ఎక్కువ కాలం లేకపోయినా తెల్ల తోక జింక మాత్రం వైరస్ వేరియంట్లకు రిజర్వాయర్‌గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా జింకలను మనుషులు వేటాడినప్పుడు లేదా వాటి మాంసాన్ని ఆరగించినప్పుడు మనుషుల నుంచి జింకలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తెల్లతోక జింకకు చెందిన ఎసిఇ 2 ( కరోనా వైరస్ ప్రవేశానికి వీలు కల్పించే ఈ ప్రొటీన్ వల్ల మనిషి కణాల్లో వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది) ప్రొటీన్ , మనుషుల్లో ఉండే ఎసిఇ2 ప్రొటీన్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి.
అందువల్లనే జింకల్లో వైరస్ సులువుగా ప్రవేశించి వ్యాప్తి చెందగలుగుతోందని పరిశోధకులు ఉదహరిస్తున్నారు. ఈ జింకలు సార్స్ కొవిడ్ 2 వ్యాప్తికి ఎక్కువగా గురౌతాయని పరిశోధకులు చూపించ గలిగితే అవి ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తాయి. ప్రతిరూపాలు చెంది , మరింత వ్యాప్తితో ఒక జింక నుంచి మరో జింకకు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఉత్తర అమెరికాలో ఈ తెల్లతోక జింక సంతతి దాదాపు 30 మిలియన్ వరకు ఉంది. వైరస్ రిజర్వాయర్‌గా ఈ జింక మారితే ఆందోళన కలిగించే విషయమే. ఈ పరిశోధనల వల్ల నిరంతర పర్యవేక్షణ కార్యక్రమాలు కొనసాగించవలసిన అవసరం ఉంటుందని తేలింది.