డబ్లుహెచ్‌ఓ సూచన
జెనీవా: మంకీపాక్స్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు తమ భాగస్వామితో శృంగారానికి దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) సూచించింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని భాగాలలో మంకీపాక్స్ స్థానికంగా వ్యాపించే వైరస్. ఇది ఎలుకలు లేదా చిన్న జంతువులు కొరకడం ద్వారా వ్యాపించే వ్యాధి. కాగా..ఇది మనుషులకు ఒకరి నుంచి మరొకరికి సోకే వైరస్ కాదు. అయితే గతంలో ఎన్నడూ ఈ వైరస్ అడుగుపెట్టని దేశాలలో కూడా ఈ ఏడాది ఈ వ్యాధికి సంబంధించి 15 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. అమెరికా, యూరపు దేశాలలో ఈ వ్యాధి స్వలింగం సంపర్కం చేసుకునే పురుషులలోనే అత్యధికంగా సోకింది. జ్వరం, వొళ్లు నొప్పులు, చలి, నీరసం, శరీరంపై దద్దుర్లు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకిన చాలామంది పురుషులలో పూర్తిగా అస్వస్థులు కావడం చాలా తక్కువని, అమెరికాలో ఇప్పటివరకు మంకీపాక్స్‌తో ఎవరూ మరణించలేదని వైద్యులు చెబుతున్నారు.