- Advertisement -
జెనీవా: కొవిడ్ నియంత్రణకు అమెరికా ఔషధ కంపెనీ మోడెర్నా రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఒ) ఆమోదం తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఒ ఆమోదించిన జాబితాలో ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల వ్యాక్సిన్లు చేరాయి. రానున్న వారాల్లో చైనా కంపెనీలు సినోఫార్మ్, సినోవాక్ రూపొందించిన వ్యాక్సిన్లకు కూడా ఆమోదం లభిస్తుందని డబ్ల్యూహెచ్‌ఒ పేర్కొన్నది. ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాక్సిన్ల సామర్థాన్ని పరీక్షించి నిగ్గు తేల్చగల సొంత వ్యవస్థలు లేకపోవడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఆ బాధ్యత తీసుకుంటోంది. చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించే యూనిసెఫ్ కూడా వ్యాక్సిన్ల సమర్థతను పరీక్షిస్తోంది. ఫైజర్‌తోపాటు మోడెర్నా టీకాలు ఎంఆర్‌ఎన్‌ఎ రకం కావడంతో వీటికి అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్ ఉన్నది.
- Advertisement -