- Advertisement -
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 2018 తర్వాత ఈసారి ఎన్నికల్లో గెలిచింది. ఈ విజయం వేడుక చేసుకునే సంతోషాన్ని ఆ పార్టీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలన్న సమస్య చుట్టుకుంది. పార్టీలో అన్ని వర్గాలకు నచ్చే వ్యక్తి ఎవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హిమాచల్ ముఖ్యమంత్రి పదవికి ముగ్గురు పోటీపడుతున్నారు. వారిలో ఒకరు ప్రతిభా సింగ్. ఆమె మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి. పైగా ఆమె ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇక పోటీపడుతున్న ఇతరులలో ప్రచార కమిటీ చీఫ్ సుఖ్‌వీందర్ సింగ్ సూఖు, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండిన ముఖేశ్ అగ్నిహోత్రి ఉన్నారు.
- Advertisement -