Wednesday, January 22, 2025

పొత్తు ఎవరడిగారు..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపితో పొత్తు పెట్టుకుంటామని ఎవ రు చెప్పారు, తమది సెక్యులర్ పార్టీ.. తమ నాయకుడు కెసిఆర్ సెక్యులర్ నాయకుడు అని మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడా రు. గడిచిన 15 రోజు ల్లో నలుగురు గురుకుల విద్యార్థిని లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తు న్న మంత్రులు,ఎంఎల్‌ఎలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ ఛానెల్‌లు,మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్య లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మేధావులు స్పందించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే, రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పోతూ కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బు సంచులు మోస్తున్నారంటూ ఆరోపించారు.

స్టాఫ్ నర్స్ పోస్టులు తామే ఇచ్చామని, ,గురుకుల పోస్టులు తామా ఇచ్చామని, ఇవన్నీ ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడని విమర్శించారు.ఎన్నికల షెడ్యూల్ ఎంత తొందర వస్తే అంత మేలు అన్నట్లు సిఎం రేవంత్ చూస్తున్నారని, రోజు వచ్చేటప్పుడు పెద్దమ్మ తల్లికి ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని మొక్కుతున్నాడు అంట ఎందుకంటే షెడ్యూల్ వస్తే హామీలు ఎగ్గొట్టవచ్చు అని సిఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. ఒక్క మేడి గడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి, అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మేడి గడ్డ డ్యామ్‌పై తమకు అనుమానం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఆయితే మళ్ళీ కుంగిన ఫిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగాలేదు అనిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని, దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు తమకు అనుమానం వస్తోందని వెల్లడించారు. రాజకీయ పరంగా కోపం ఉంటే తమపై రాజకీయంగా తీర్చుకోండి, కానీ రైతుల పై మీ కోపం చూపించకండి, ఇప్పటికే అనేక ఎకరాల కు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వాళ్లకు నీళ్లు ఇవ్వండన్నారు.

తమ ప్రాంతంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఎదో వృధా అని చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డిని తాను సూటిగా అడుగుతున్న మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ లతోపాటు 420 హామీలను వెంటనే అమలు చేయండని, పార్లమెంట్ ఎన్నికల ముందే అమలు చేయండని డిమాండ్ చేశారు. ఎందు కంటే ఎన్నికల కోడ్ పేరు తో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేము అని చెప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘పదే పదే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇతర నాయకులు బిఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారని, అస్సలు బిజెపితో పొత్తు పెట్టుకుంటాం అని ఎవరు చెప్పారు. మాది సెక్యులర్ పార్టీ.మా కేసీఆర్ సెక్యులర్ నాయకుడు. అస్సలు కిషన్ రెడ్డితో ఎవరు అన్నారు మేము అన్నమా. ఎందుకు బిజెపి నాయకులు ఎగిరెగిరి పడుతున్నార’ని బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే అమలు చేశారని, అది మహిళకు ఉచిత బస్ ప్రయాణమని పేర్కొంటూ చాలా గ్రామాలకు బస్ సౌకర్యాలు లేవన్నారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, కానీ తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News