Monday, December 23, 2024

కోవిడ్‌పై నిర్దిష్ట, రియల్ టైమ్ డేటాను ఇవ్వండి!

- Advertisement -
- Advertisement -
చైనాను కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనా అధికారులను కలుసుకున్నారు. చైనాలోని మహమ్మారి పరిస్థితిపై నిర్ధిష్ట, రియల్‌టైమ్ డేటాను అందించాల్సిందిగా మరోసారి కోరారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్‌సైట్లో ఓ ప్రకటన విడుదలచేసింది. ఉన్నతాధికారుల సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత జనెటిక్ సీక్వెన్సింగ్ డేటా, వ్యాధి ప్రభావ డేటా, ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలు, ఐసియూ చేరికలు, మరణాలు, వ్యాక్సిన్ ఎంత మందికి ఇచ్చిందన్న వివరాలు కావాలని, ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చిన వ్యాక్సిన్ వివరాలు కావాలని కోరింది. హైరిస్క్ ప్రజలను కాపాడేందుకు వ్యాక్సిన్, బూస్టర్స్ ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురించి మరోసారి తెలిపింది.

చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్, నేషనల్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించడం జరిగింది. ప్రధానంగా వేరియంట్స్, వ్యాక్సినేషన్, క్లినికల్ కేర్, వ్యాప్తి, ఆర్ అండ్ డి గురించి తెలిపింది.

చైనాకు క్లినికల్ కేర్, హెల్త్ కేర్ సిస్టంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతును కొనసాగిస్తుందని టెడ్రోస్ తెలిపారు. చైనా నుంచి వచ్చే వారిపై వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు, మార్గదర్శకాలను విధించడంపై టెడ్రోసష్ మాట్లాడుతూ చైనాలో విజృంభించిన వ్యాధి వివరాలు తెలియకపోవడం వల్లే ఆయా దేశాలు సురక్షిత విధానాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. దానిని మనం అర్థం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News