Tuesday, September 17, 2024

ఉమ్మడి రాజధానిలో లబ్ధి పొందింది ఎవరు?

- Advertisement -
- Advertisement -

ఆనాడు తెలంగాణ ఆంధ్ర విభజనలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించారు. ఆ గడువు రేపు జూన్ 2 తో ముగియనుంది. తెలంగాణ ఆంధ్రరాజకీయలో అల్లజడి మొదలు కాబోతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరుగలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరిగింది. కృష్ణా డెల్టా వాటర్ విషయంలో కాని, విద్యుత్తు వినియోగంలో కాని వివాదాలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాలు చివరకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మినారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్ళపాటు కొనసాగించాలని రాష్ట్రపతికి ట్వీట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ ఈ విషయంపై ఆసక్తికర ఆరోపణలు చేసింది. దీంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంపై అధికార, ప్రతిపక్షాలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎపి విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లకు మించకుండా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి రాజధాని లేకపోవటంతో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరాన్ని మరి కొందరు ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది సరైన వాదననే అని అక్కడక్కడ వినిపిస్తున్నాయి.

కాని దీనిపై తెలంగాణ నేతలు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఇక ఎంతో కాలం కొనసాగదు, దాని కాలవ్యవధి ముగిసిపోయే సమయం దగ్గర్లోనే ఉంది. జూన్ 2వ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది. భాగ్యనగరం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింట్ డే సందర్భంగా ఎపి, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 2024 జూన్ 1వ తేదీ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించారు. ఇదే అంశాన్ని ఎపి పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా 2014లో విభజించినప్పుడు అప్పటి వరకు రెండు ప్రాంతాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బందిపడకుండా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో ఈసారి జూన్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది.

కాబట్టి తర్వాత ఏం జరగబోతోందనే ఆందోళన ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. జూన్ 2న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగిసిపోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండబోతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం ఉంది. ఈ అంశంలో ఇప్పుడు ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీనికి కారణం పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఎలాంటి విద్వేషాలు, కలహాలు, భేదాభిప్రాయాలు లేకుండా కొనసాగడంతో కేంద్ర ప్రతిపాదన పదేళ్ల పాటు అమలైంది. ఇప్పటికే ఎపికి రాజధానిగా అమరావతిని మాజీ సిఎం చంద్రబాబు ఎంపిక చేయడం జరిగింది. ఎపి సిఎం జగన్ మూడు రాజధానులు తెచ్చినా వాటిపై సుప్రీంలో కేసు నడుస్తుండటంతో అది తేలేవరకూ దానిపై ఎలాంటి చర్చలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగిసిపోవడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇన్నాళ్లూ హైదరాబాద్ అనే ఓ బంధం కారణంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వచ్చాయి.కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు ముందుకు పడతాయి. ఈ సమయంలోనే దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగడం, ఏ ప్రభుత్వం వస్తుందో, వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థిరపడిన తర్వాత ఉమ్మడి రాజధానిపై చర్చించే అవకాశం ఉంది. లేకపోతే గడువును పొడిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లోని ఎపి కార్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి మార్చుతున్నారు. 2016లోనే 90% కార్యాలయాలు తెలంగాణ నుంచి ఎపికి తరలించారు. తాజాగా ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు. రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినా ఆస్తుల పంపిణీ మాత్రం పూర్తి కాలేదు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు సైతం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోవడంతో విభజన ప్రణాళికలోని ఇతర అంశాలు, 1.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పంచడం వంటి ఇతర అంశాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం చేసేది ఏమి లేక రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. విభజన సమయంలో ఆస్తుల పంపకాలు కొన్ని చేసింది. మరి కొన్ని పెండింగ్‌లో పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తెలంగాణకు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ముందు కూడా అన్ని విధాలుగా ముందుకు పోవాలని ఆశిస్తూ రెండు ప్రాంతాల ప్రజలు విడిపోయినా తెలుగువాళ్ళుగా కలిసిమెలసి జీవిస్తున్నారు.

మిద్దె సురేష్
9701209355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News