Sunday, January 19, 2025

ఆధారాల ధ్వంసానికి సహకరించింది ఎవరు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారించిన పోలీసులు, ఎవరూ లోనికి రాకుం డా, మీడియా కంటపడకుండా జాగ్రత్త వహించారు. ఎస్‌ఐబిలో అతనితో పాటు పని చేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధి కారులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, వారి వాంగ్మూలం నమోదు చేశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నించారు. డిసెంబర్ 4వ తేదీన ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించారని ప్రణీత్‌రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సిడిఆర్, ఐపి అడ్రస్‌ల డేటాను సేకరించారని అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ధ్వంసం చేసి, కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రణీత్‌ను ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. మరోవైపు వికారాబాద్ అడవుల్లో పడేసిన ధ్వంసం చేసిన ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణీత్‌ను స్వయంగా అక్కడకు తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో పోలీసులు గాలించ నున్నారు. రెండో రోజు విచారణ సందర్భంగా హార్డ్‌డిస్క్‌లను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రణీత్‌ను వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు వెతికి, స్వాధీనం చేసుకునేందుకు పోలీ సులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్‌రావును తొలి రోజు రహస్య ప్రాంతానికి తరలించి విచారించిన పోలీ సులు, సోమవారం రోజున బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారడంతో ముందు జాగ్రత్తగా ఠాణా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు మూసివేసి, ఎవరినీ లోనికి అనుమతించకుండా ప్రణీత్‌ను విచారించారు. మరోవైపు ప్రమోషన్ల ఆశచూపించి కింది స్థాయి సిబ్బందితో ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించారని వరంగల్ తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ బిఆర్‌ఎస్ నేత ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. సుమారు 100 నెంబర్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేశారని అలా సేకరించిన డేటాను 17 కంప్యూటర్ల ద్వారా ప్రైవేట్ డ్రైవ్ ల్లోకి తీసుకున్నట్లు గుర్తించారు. ప్రణీత్ రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను గుర్తించిన పోలీసులు.. ఈ పని ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చెబితే చేయాల్సి వచ్చిందనే విషయంపై దర్యాప్తు కొనసా గిస్తున్నారు. ఈ కేసులో కీలక విషయాలపై కూపీ లాగుతున్న దర్యాప్తు అధికారులు ప్రణీత్ తో కలిసి పని చేసినవారిని విచారి స్తున్నట్లు తెలు స్తోంది. ప్రణీత్ రావు వ్యవహారంలో ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్‌లను బయటకు తెప్పించేం దుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు రాజకీయంగా పెను సంచలనం కలిగే అవకాశాలు కనిపి స్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News