- Advertisement -
కాకినాడ పోర్టు తనిఖీల్లో బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీసే క్రమంలో పదేపదే నాకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అసలు ఎవరీ అలీషా? ఎవరీ అగర్వాల్ ? మానసా సంస్థ ఎవరిది? ఆ వివరాలతో నివేదిక ఇవ్వండి’’ అంటూ ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
బియ్యం ఎగుమతుల్లో కీలకమైన వ్యక్తి వినోద్ అగర్వాల్. ఇక షేఖ్ అహ్మద్ అలీషా పోర్టులో ఓడల తయారీ ద్వారా కీలకంగా మారిన వ్యక్తి. కాగా మానసా సంస్థ యజమాని కాకినాడ వైకాపా మాజీ ఎంఎల్ఏ ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రా రెడ్డి కావడం గమనించాల్సిన విషయం. వీరి అండదండలతోనే వైకాపా ప్రభుత్వంలో గత ఐదేళ్లూ పేదల బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా రవాణా అయ్యిందన్న ఆరోపణలున్నాయి. ఇక పోర్టులో చక్రం తిప్పే కీలక వ్యక్తులు ద్వారంపూడి సన్నిహితులు కావడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
- Advertisement -