బీజింగ్ :వుహాన్‌లో కొవిడ్19 మూలాలను పరిశీలించడానికి సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఈ నెల 14న సింగపూర్ నుంచి నేరుగా వుహాన్‌కు వెళ్ల నున్నారు. చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పదిమంది నిపుణులతో కూడిన ఈ బృందం క్వారంటైన్ లోకి వెళ్తారా లేదా, వాళ్ల ఉద్దేశ్యమేమిటో, వుహాన్‌లో ఎంతకాలం ఉంటారో ఈ వివరాలేవీ తమకు తెలియవని చెప్పారు. ఈ పర్యటనపై చైనా ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం బీజింగ్ పరిసరాల్లో కరోనా కేసులు మళ్లీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా 55 కేసులు నమోదయ్యాయని, వీటిలో 40 ఉత్తర చైనా లోని హెబెయి ప్రావిన్స్‌లో బయటపడ్డాయని, మరొకటి చైనా రాజధానిలో కనిపించిందని చైనా వెల్లడించింది. హెబెయి ప్రావిన్స్‌లో మొత్తం 326 కేసులు నమోదు కాగా, వీటిలో 234 అసింప్టమెటిక్ కేసులు జనవరి 2 నుంచి 12 వరకు నమోదయ్యాయని వివరించింది. హెబెయి ప్రావిన్స్ రాజధాని షిజియాజంగ్, జింగ్‌టాయి, లాంగ్‌ఫాంగ్ నగరాల్లో లాక్‌డౌన్ విధించారు.
WHO Expert Team Will Go to Wuhan on Jan 14th