న్యూయార్క్ : భారత స్వదేశీ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక కమిటీ నుంచి 24 గంటల్లో సిఫార్సు రావచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ తెలిపారు. కొవాగ్జిన్ డేటాను డబ్లుహెచ్‌వొ సాంకేతిక సలహా గ్రూప్ ప్రస్తుతం సమీక్షిస్తోందని తెలిపారు. అంతా సానుకూలమై కమిటీ సంతృప్తి చెందితే మరో 24 గంటల్లో సిఫార్సు వస్తుందని తాము అనుకుంటున్నట్టు తెలిపారు. లక్షల మంది భారతీయులు కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నప్పటికీ డబ్లుహెచ్‌వొ సిఫార్సు పెండింగ్‌లో ఉండడంతో విదేశాలకు వెళ్ల లేక పోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీని అత్యవసర వినియోగానికి సిఫార్సు చేయాల్సిందిగా గత ఏప్రిల్ 19 న ప్రపంచ ఆరోగ్యసంస్థకు దరఖాస్తు చేసింది. అయితే ఇంకా మరింత డేటా అవసరమని డబ్లుహెచ్‌వొ సూచించింది. డబ్లుహెచ్ ఒ అనుమతి లేకుంటే ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్‌ను అంగీకరించవు.
మరో 24 గంటల్లో కొవాగ్జిన్‌కు డబ్లుహెచ్‌వొ గ్రీన్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -