24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?
నాలుగోసారి బరిలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బోణీ కొట్టని బిజెపికి విజయం దక్కేనా?
హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో ఈ సారి జెండా పాతేదెవరన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసిన ఉద్యమ శాలి చర్నకోలు లక్ష్మారెడ్డి ఇప్పటికే ముచ్చటగా మూడు సార్లు హ్యాట్రిక్ సాధించి,నాలుగో సారి ఈ ఎన్నికల పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి అనిరుధ్‌రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి చిత్తరంజన్ దాస్ బరిలో ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్యనే పోటీ ఉండగా బిజెపి చీల్చే ఓట్లు ఎవరికి లాభిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్, టిడిపి, బిఆర్‌ఎస్ 3 సార్లు…
ఇప్పటి దాక జడ్చర్ల నియోకజవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్‌ఎస్ మూడు సార్లు విజయకేతనం ఎగుర వేశారు. 1972లో నియోజకవర్గం ఏర్పడగా 1972,1978లో జరిగిన ఎన్నికల్లో బిసి సామాజిక వర్గానికి చెందిన నర్సప్ప విజయం సాధించారు. 1983లో ఐఎన్‌డి కృష్ణారెడ్డి గెలిచారు. ఇక 1989లో కాంగ్రెస్ నుంచి సుధాకర్ రెడ్డి విజయం సాధించారు. 1994లో ఎర్ర సత్యం తెలుగుదేశం పార్టీ నుంచి గెలవగా, ఆయన మరణాంతరం జరిగిన 1999లో జరిగిన ఎన్నికల్లో నూ ఆయన తమ్ముడు ఎర్ర శేఖర్ విజయం సాధించారు. 2004లో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి మొదటి సారిగా చర్నకోల లకా్ష్మరెడ్డి తన గెలుపు ఖాతాను తెరిచారు.
2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టిడిపి నుంచి ఎర్రశేఖర్ గెలిచారు. తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో కెసిఆర్ పిలుపు మేరకు లకా్ష్మరెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. చివరికి తన పదవిని కూడా త్యాగం చేసి తెలంగాణ సాధనలో తను కూడా బాగస్వామ్యం అయ్యారు. లకా్ష్మరెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం తన పదవికి రాజీనామా చేయగా 2009లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి గెలిచారు. ఇక అప్పటి నుంచి 2014లోఒ జరిగిన ఎన్నికల్లోనూ, 2018లో జరిగిన ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు. ఇక ప్రస్తుతం 2023లో జరుగుతున్న ఎన్నికల్లో తను అఖండ మెజార్టీతో గెలుస్తానని దీమాతో ఉన్నారు.
34 ఏళ్ల కాంగ్రెస్ కల నెరవేరుతుందా?
జడ్చర్ల నియోజకవర్గంలో 1972,1978,1989లో చివరిగా కాంగ్రెస్ గెలిచి%8