విశాఖపట్న: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ ముందు 273 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో కోల్‌కతా జట్టు 106 పరుగుల భారీ తేడా గెలుపొందింది. మ్యాచ్‌లో నరైన్ 39 బంతుల్లో 85 పరుగులు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అంగ్‌క్రిష్ రఘువంశీ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా అతడు రికార్డులోకెక్కాడు.
అతడు ఇలానే బ్యాటింగ్ కొనసాగిస్తే టీమిండియా జట్టులోకి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. రఘువంశీ 2005లో ఢిల్లీలో జన్మించారు. 2023 అండర్ 19 వరల్డ్ ప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో 278 పరుగులు చేశాడు. ఐపిఎల్ వేలంగా భాగంగా రఘువంశీని రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంగ్‌క్రిష్ ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మర్చాడు. చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అతడికి బ్యాటింగ్ లో తర్పీదు ఇచ్చాడు. ముంబయి తరపున లిస్ట్ ఎ, టి20లలో అడుగు పెట్టాడు. సికె నాయుడు ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 765 పరుగులు చేశాడు.
Innovative!
Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd
— IndianPremierLeague (@IPL) April 3, 2024