Sunday, July 7, 2024

ఎవరీ ‘భోలే బాబా’ ?

- Advertisement -
- Advertisement -

హథ్రాస్(లక్నో): నారాయణ్ సకార్ విశ్వ హరి లేక ‘భోలే బాబా’ అసలెవరు? ఇటీవల హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది చనిపోవడానికి ఇతడు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమమమే కారణం. ఆ తొక్కిసలాట మరణాల సంఖ్య బుధవారానికి 121 కి చేరుకున్నాయి.  అతడి అనుచరులు , భక్తులు అతడిని చాలా శక్తిగల వాడిగా, దయ్యాలను వదిలిస్తాడని, భూత వైద్యుడని, మాంత్రిక శక్తులతో కోరికలను తీరుస్తాడని, దైవ స్వరూపుడని గుడ్డిగా నమ్మతారు.

తనకు మాంత్రిక శక్తులున్నాయని నమ్మించిన అతడిని 2000లో ఆగ్రాలో అరెస్టు కూడా చేశారు. అప్పట్లో అతడు చనిపోయిన ఓ 16 ఏళ్ల అమ్మాయి మృత దేహాన్ని బలవంతంగా తీసుకుని ఆమెని బతికిస్తనన్నాడు. ఆ కేసు అతడిపై బుక్ అయింది. కానీ తర్వాత ఏ కారణం చేతనో ఆ కేసును మూసేశారు.

ఇప్పటికి రెండు దశాబ్దాల కిందట అంటే 1990 దశకంలో ఉత్తర్ ప్రదేశ్ లోని కస్ గంజ్ కు చెందిన సూరజ్ పాల్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. తర్వాత అతడు తనకు తానుగా స్వామిజీ అవతారం ఎత్తాడు. మొదట్లో తక్కువ ఆదాయం ఉన్న దళిత కుటుంబాలను పోగుచేసుకున్నాడు. వారు ఆయన పెరుగుతున్న ప్రతిష్టకు ప్రభావితులయ్యారు. వారిలో చాలా మంది ఆయనను భోలే బాబా అంటూ ఆరాధించడం మొదలెట్టారు. అయితే అతడు తనకు ఎలాంటి ముడుపులు కోరుకోలేదు. ‘‘ ఆయన మా నుంచి ఎలాంటి నైవేద్యాలు కోరుకోలేదు. తన సత్సంగ్ లో ఆయన అబద్ధాలు ఆడొద్దు, మాంసం, చేపలు, గుడ్లు తినకూడదని, మత్తుపానీయాలు సేవించకూడదు అని భోధించేవాడు’’ అని సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్న  ఊర్మిళా దేవి తెలిపారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానాకి ఆమె హాజరవ్వడం ఇది నాలుగోసారి. తొక్కిసలాటలో ఆమె సోదరీమణి తారామతి గాయపడింది.

హథ్రాస్ లోని డోంకెలీ గ్రామంకు చెందిన వాసులు ‘భోలే బాబా’కు 10 నుంచి 12 మంది సేవకులు( ప్రధాన అనుచరులు) ప్రతి గ్రామంలో ఉన్నారని తెలిపారు. ‘‘వారు వచ్చి గ్రామంలోని జనాలకు సత్సంగ్ గురించి తెలిపి, కారులు బస్సుల్లో వారిని తీసుకెళ్లేవారు’’ అని వివరించారు. వారిలో చాలా మంది అనుచరులు ఓ పసుప లాకెట్ ని ధరించేవారని, అందులో భోలే బాబా ఫోటో ఉండేదని వివరించారు. భక్తులు ఆయన పాదాల కింది మన్నును తీసుకోడానికి కూడా పోటాపోటీ పడేవారని అధికారులు తెలిపారు. వివేక్ ఠాకుర్ అనే ఆటో డ్రైవర్ ‘‘ ఆయన పాదాల ధూళిని శరీరానికి లేక నదుటికి రాసుకుంటే అన్ని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తారు’’ అని తెలిపాడు.

భోలే బాబా చాలా వరకు భూత వైద్యం చేసేవాడు. ప్రధానంగా యువతులపైన.

ప్రస్తుతం రిటై అయిన పోలీస్ అధికారి  తన్వీర్ సింగ్ నాడు  ఆగ్రాలోని షాహగంజ్ లో పోలీసు అధికారిగా ఉండేవారు. 2000 మార్చిలో తాను అతడిని అరెస్టు చేసినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘ అప్పట్లో సూరజ్ పాల్ దాదాపు 200 నుంచి 250 మందితో స్మశాన వాటికకు చేరుకున్నాడు. ఓ కుటుంబం 16 ఏళ్ల అమ్మాయి మృత దేహాన్ని తీసుకురాగ, సూరజ్ పాల్ , తదితరులు ఆ కుటుంబాన్ని ఆపారు. అంత్య క్రియలు జరుగనీయకుండా అడ్డుకున్నారు. పైగా ఆమెను పున: జీవింప చేస్తాం’’ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం ఆ చనిపోయిన అమ్మాయి పేరు స్నేహ లత. స్థానికురాలు. 2000 మార్చి 18న కేసు నమోదయింది’’ అని ఆ రిటైర్డ్ పోలీస్ అధికారి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News