Friday, December 27, 2024

బ్యారేజ్ కుంగిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలి : ఈటల రాజేందర్.

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలతో పాటు ప్రజలకు నీళ్లు ఎలా ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. లక్ష్మిబ్యారేజ్ లో కొంతభాగం కంగిపోయిందన్న వార్తల నేపథ్యంలో మేడిగడ్డలో ప్రాజెక్టు పరిసరాలను ఆదివారం బిజెపి నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ బ్యారేజీ సంబంధించి మొత్తం పంపులు మునిగిపోయాయి.

ఇప్పుడు బ్యారేజ్ కుంగిపోవడంతో.. మళ్ళీ సమాచారం లేకుండా గేట్లు తెరవడం వల్ల బర్లు గొర్లు, పొలాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు చిన్న విపత్తు కాదు. ఒకటే పిల్లర్ 5 అడుగులు కుంగింది అంటున్నారు. 15 నెంబర్ నుంచి 22 పిల్లర్ వరకు కొన్ని వందల టన్నుల కాంక్రీట్ తో నిర్మించినవి కుంగినవి. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశీలన చేసిన వారిలో మాజీ ఐఏఎస్ అధికారులు రామచంద్రుడు, చంద్రవదన్, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి మొలుగూరు ఉన్నారు.

Etela 2

Etela 4

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News