Tuesday, April 1, 2025

కంగనా రనౌత్ ఎవరు? : అన్నూ కపూర్

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి కంగనా రనౌత్ ను ఛండీగఢ్ విమానాశ్రయంలో ఓ సిఐఎస్ఓ లేడీ కానిస్టేబుల్ చెంప పగుల గొట్టడంపై నటుడు అన్నూ కపూర్ రియాక్షన్ ఏమిటని అడుగగా ఆయన ‘‘ ఈ కంగనా జీ ఎవరు? దయచేసి ఆమె ఎవరో చెప్పండి. మీరు అడగడాన్ని బట్టి చూస్తే ఆమె పెద్ద హిరోయిన్ అయి ఉండొచ్చు…ఆమె అందంగా ఉంటుందా?’’ అన్నారు. మొదట్లో అయితే ఆయన మాట్లాడ కుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరికి పెదవి విరిచారు.

అప్పుడు విలేకరి ఆమె నటియే కాదు కొత్తగా మండీ నుంచి ఎన్నికైన ఎంపీ అని తెలుపగా ‘‘ ఎంపీ కూడా అయిపోయిందా, అంటే మంచి శక్తిశాలి అయి ఉంటుంది’’ అన్నారు. ఇంకా చెప్పమని అన్నప్పుడు ‘‘ఆమె తనను కొట్టిన సిబ్బందిపై  న్యాయపరమైన చర్య తీసుకోవాలి, ఆమె స్థానంలో తానుండి ఉంటే అదే చేసేవాడిని’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

అన్నూ కపూర్ తన రాబోయే చిత్రం ‘హమారే బారా’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కంగనా రనౌత్ ఘటనపై తన అభిప్రాయం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News