Monday, December 23, 2024

సిఎం ఎవరనేది ఈరోజు తేల్చేస్తారట

- Advertisement -
- Advertisement -

తెలంగాణా ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కు మంగళవారం తెర దించుతామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోగా సిఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని చెప్పారు. సోమవారం సిఎల్ పీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు మాణిక్ రావు ఠాక్రే, డికె శివకుమార్ ఈరోజు ఢిల్లీలో ఖర్గేతో భేటీ అవుతారు. అధిష్ఠానం తెలంగాణా సిఎం ఎవరో తేల్చాక వారు హైదరాబాద్ కు తిరిగివస్తారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖర్గేతో సమావేశమవుతారు.

వాస్తవానికి సోమవారమే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత  ప్రచారం సాగింది. అయితే ఉప ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడటంతో ప్రమాణ స్వీకారం జరగలేదు. దీంతో ఈనెల 7న ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News