Monday, November 25, 2024

తెలంగాణ కొత్త సిఎం ఎవరు?.. రేసులో ఎవరున్నారో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కొత్త సిఎం ప్రమాణ స్వీకారంపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కొత్త సిఎం ఎంపికను అధిష్ఠానానికే అప్పగించారు ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానంతో చర్చించేందుకు శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే ప్రమాణస్వీకారానికి రాజ్ భవన్ సిద్ధమైంది.

అటు సచివాలయంలో పాత బోర్డులను తొలగిస్తున్నారు. మంత్రులు, సలహాదారుల పేషీల సిబ్బంది ఛాంబర్లను ఖాళీ చేస్తున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావాలని ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వల్లే కెసిఆర్ ను తట్టుకుని కాంగ్రెస్ నిలబడిందని, అందుకే సిఎం పగ్గాలు ఆయనకే ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం సిఎం రేసు జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు  ముఖ్యమంత్రి ఎవరూ అవుతారో చూడాలి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News