Monday, December 23, 2024

ఇంతకీ ఎఐసిసి అధ్యక్షులు ఎవరు : డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మం సభలో రాహుల్ గాంధీ.. బిఆర్‌ఎస్ బిజెపి బి టీమ్ అనడం సిగ్గు చేటు అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఒక్క రాష్ట్రంలో గెలిచి కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ‘ఎఐసిసి అధ్యక్ష పదవి వద్దన్న రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీయా మల్లికార్జున్ ఖర్గేనా?’ అని ఆమె ప్రశ్నించారు. ‘గతంలో బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది బిజెపినా.. కాంగ్రెసా? మొన్న ప్రతిపక్ష నాయకుల సమవేశాలు ఏర్పాటు చేసిన అఖిలేష్‌యాదవ్ ,హైదరాబాద్ కు వచ్చి కెసిఆర్‌ను కలవడం దేనికి సంకేతం ?’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అఖిలేష్‌ను బిఆర్‌ఎస్ వద్దకు కాంగ్రెస్ దూతగా పంపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే బిఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారు. భవిష్యత్‌లో కూడా అదే జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News