Monday, January 20, 2025

30 బిలియన్ డాలర్ల ఎస్‌పి గ్రూప్ వారసుడెవరు?

- Advertisement -
- Advertisement -

Who is the successor of the 30 billion dollar SP group?

 

న్యూఢిల్లీ : షాపూర్జీ పల్లోంజి(ఎస్‌పి) గ్రూప్ 157 ఏళ్ల క్రితం నాటి సంస్థ, ఈ గ్రూప్ యువ వారసుడు సైరస్ మిస్త్రీ(54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కంపెనీ భవిష్యత్ నాయకుడు ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ గ్రూప్ పితగా పేర్కొనే షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ(93) 2022 జూన్ 28న మృతి చెందారు. వీరిద్దరు మృతి చెందడంతో గ్రూప్‌ను నడిపేవారు ఎవరనే ప్రశ్నలు నెలకొన్నాయి. సైరస్‌కు భార్య రోహిఖా, ఇద్దరు కుమారులు ఫిరోజ్, జహాన్ ఉన్నారు. అయితే వారు బాధ్యతలు చేపట్టడం కష్టమే కానీ, సైరస్ సోదరురుడు షాపూర్ మిస్త్రీ ఉన్నారు. ఆయనే ఎస్‌పి గ్రూప్‌కు నాయకత్వ వహిస్తారని సమాచారం. 30 బిలియన్ డాలర్ల విలువ కల్గిన డైవర్సిఫైడ్ షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌నకు 130 బిలియన్ డాలర్ల విలువచేసే టాటా గ్రూప్‌లో 18.6 శాతం వాటా ఉంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఎస్‌పి గ్రూప్ నికర విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే టాటా గ్రూప్‌లో చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియమించిన తర్వాత ఆయన కుటుంబ వ్యాపారాన్ని చూసుకోలేదు. ఆ సమయంలో కుటుంబ సంస్థ ఎస్‌పి గ్రూప్‌ను ఆయన సోదరుడు షాపూర్ మిస్త్రీకి అప్పగించారు. అయితే 2019 చివరి నుంచి గ్రూప్ బోర్డులోకి షాపూర్ కుమారుడు పల్లోన్(26) చేసిన తర్వాత సంస్థలో అనేక మార్పులు జరగ్గా, కుమార్తె తాన్యా గ్రూప్‌కు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కార్యక్రమాలను నిర్వహించింది. కొత్త తరంతో గ్రూప్ కంపెనీల్లో డిజిటైజేషన్ పెరగ్గా, వాటాదారులతో కమ్యూనికేషన్ మెరుగైంది. పల్లోన్ ఇప్పుడు ప్యానెల్ ఉంటూ దీర్ఘకాలిక, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సైరస్ మిస్త్రీ ఆధ్వర్యంలో షాపూర్జీ పల్లోంజి గ్రూప్ మరింత వృద్ధిని సాధించింది. ఇప్పుడు 23 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మధ్యప్రాచ్య, ఆఫ్రికాతో పాటు భారత్‌లో ఆయన సత్తా చాటారు. 2016 అక్టోబర్‌లో చైర్మన్‌గా టాటా సన్స్ నుంచి మిస్త్రీని తొలగించారు. ఆ తర్వాత ఆయన సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News