Tuesday, January 7, 2025

పి.వి.సింధు కాబోయే భర్త వెంకటదత్త సాయి ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు త్వరలో ప్రముఖ వ్యాపారవేత్త వెంకటదత్త సాయిని వివాహమాడనున్న సంగతి తెలిసిందే. దీంతో అందరి దృష్టి వెంకటదత్త సాయివైపు మళ్లీంది. ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి, ఆయనకు సంబంధించి హాబీలు తదితర వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. వెంకటదత్త సాయి ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన తండ్రి జిటి వెంకటేశ్వర రావు ఐఆర్‌ఎస్ అధికారి. వెంకటదత్త తాతా ప్రముఖ హైకోర్టు న్యాయవాది. ఇక వెంకటదత్తకు ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుంది. ఆయన ప్రముఖ ఐటి సంస్థ పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

మోటార్ స్పోర్ట్ అంటే ఇష్టం..
వెంకటదత్త ఐటి టెక్నాలజీకి చెందిన వ్యక్తి అయినా ఆయనకు క్రీడలంటే కూడా ఎంతో ఇష్టం. ముఖ్యంగా బైక్ రైడింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అంతేగాక పర్వతారోహణలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన తరచుగా ట్రెక్కింగ్, బైక్ రేసింగ్ ఈవెంట్‌లలో పాల్గొంటారని సమాచారం. వెంకటదత్త వద్ద పలు స్పోర్ట్ బైక్స్, స్పోర్ట్ కార్లు ఉన్నట్టు తెలిసింది. తీరిక సమయాల్లో ఆయన సాహస క్రీడల్లో పాల్గొంటారని ఆయనకు సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News