Thursday, December 19, 2024

మోడీకి రిటైర్ అయ్యే టైమ్ వచ్చింది.. తదుపరి ప్రధాని ఎవరు?: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పైన, ప్రధాని నరేంద్ర మోడీపైన తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తరువాత జైలులో నుంచి విడుదల అయిన మరునాడు శనివారం ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో కేజ్రీవాల్ ప్రసంగించారు.

‘మీ ప్రధాని అభ్యర్థి ఎవరు కాబోతున్నారని ఇండియా కూటమి పార్టీలను బిజెపి అడుగుతూ ఉంటుంది. నేను కాషాయ పార్టీని వారి ప్రధాని అభ్యర్థి ఎవరని అడుగుతున్నా’ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17న 75వ ఏట ప్రవేశిస్తున్నందున ఆయన ఆ ఏడాది రిటైర్ అవుతున్నారా అని కేజ్రీవాల్ అడిగారు. ‘ప్రధాని మోడీ సెప్టెంబర్ 17న 75వ ఏట ప్రవేశిస్తారు. 75 ఏళ్లు దాటిన తరువాత పార్టీలో నేతలు రిటైర్ కావాలని ఆయన ఒక నిబంధన పెట్టారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైరయ్యారు. ఇప్పుడు ప్రధాని మోడీ సెప్టెంబర్ 17న రిటైర్ కాబోతున్నారా?’ అని కేజ్రీవాల్ అన్నారు.

‘వారి ప్రభుత్వం కనుక ఏర్పడిన పక్షంలో వారు ముందు యోగి ఆదిత్యనాథ్‌ను వదిలించుకుంటారు. తరువాత అమిత్ షాను దేశ ప్రధానిని చేస్తారు. అమిత్ షా కోసం ప్రధాని మోడీ వోట్లు కోరుతున్నారు. మరి మోడీ గ్యారంటీని అమిత్ షా నెరవేరుస్తారా?’ అని ఆప్ చీఫ్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మరింత ముందుకు వెళ్లి ‘మోడీకీ గ్యారంటీని ఎవరు బట్వాడా చేస్తారు? అమిత్ షా మీ వాగ్దానాలు నెరవేరుస్తారా?’ అని అడిగారు. బిజెపి వోటర్లు తాము వోటు చేయబోతున్నది మోడీజీకి కాదని, అమిత్ షా కోసమని గ్రహించాలని కేజ్రీవాల్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News