Sunday, September 8, 2024

ఎవడ్రా పడగొట్టేది?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ఖానాపూర్/ఉట్నూర్: మూడు నెలల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సిఎం అవుతారని కొందరు అంటున్నారు, అసలు ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేదని రేవంత్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, మా ప్రభుత్వాన్ని పడగొడితే జనం ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కెసిఆర్ సిఎం అవుతారని ఎవరైనా అంటే పళ్లు రాలగోడతామని ఆయన హెచ్చరించారు. కెసిఆర్ మళ్లీ సిఎం కా దు కదా, కనీసం మంత్రి కూడా కాలేరని రేవంత్ ఎద్దేవా చేశా రు.

కెసిఆర్ మళ్లీ జన్మలో కూడా ఇక ముఖ్యమంత్రి కాలేరని రేవంత్ జోస్యం చెప్పారు. కెసిఆర్ ఇక ఆయన ఫాంహౌస్‌కు సి ఎం కావాల్సిందేనని ఆయన సెటైర్ వేశారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభ పేరుతో కాంగ్రెస్ శుక్రవారం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూ రించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా తొలి సభను ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ కెసిఆర్ మళ్లీ సిఎం కావాలనుకుంటే నిత్యనంద స్వామిలా ఆయ న కూడా ఒక దీవి కొనుక్కోని కెసిఆర్ దానికి సిఎం కావాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు. చెరుకు తోటలో అడవి పందులు పడినట్టు కెసిఆర్ తెలంగాణను విధ్వంసం చేశారని సిఎం రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదని అప్పుడే బిఆరఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కెసిఆర్ పదేళ్లలో చేయనిది, తాము రెండు నెలల్లోనే ఎలా చేస్తామని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే విమర్శలు మొదలుపెట్టారని సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

ప్రియాంక చేతుల మీదుగా రూ.500లకే సిలిండర్
రాబోయే 15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సిఎం రేవంత్ హామీనిచ్చారు. దీంతోపాటు త్వరలోనే ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆమె చేతులమీదుగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభిస్తామ అన్నారు. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బిఆర్‌ఎస్ జం పింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ, తమ కూటమిలోకి మాత్రం కెసిఆర్‌ను రానివ్వమని ఆయన తేల్చి చెప్పారు. బిజెపికి, బిఆర్‌ఎస్‌కు 6 నుంచి 7 ఎంపి సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని రేవంత్ జోస్యం చెప్పారు. మోడీఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా అని ప్రశ్నించారు.

రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేసిందని ఆయన ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కెసిఆర్ కుటుంబం మార్చిందని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దో చుకున్నారనిఆరోపించారు. దోపిడీ పాలన కారణంగా, పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. తెలంగాణ ఏమైనా కెసిఆర్ కుటుంబం కో సం వచ్చిందా? అని రేవంత్ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో కెసిఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మొండిచేయి చూపిన కెసిఆర్, తన బిడ్డ కవితను ప్రజలు ఓడించినా ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారంటూ రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.

కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు…
15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కోర్టు కేసులు పరిష్కారం అయ్యేలా పని చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలిచ్చామని సిఎం రేవంత్ చెప్పారు.

ఆనాడే క్షమాపణలు చెప్పా..
రాంజీగోండ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని సిఎం ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామన్నారు. గూడాలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నా రు. అమర వీరుల కుటుంబాలకి రూ.5 లక్షల ఇచ్చి అండగా నిలిచామన్నారు. మతం పేరుతో ఒకరు, మద్యం పేరుతో మరొరు వస్తారు అందరే అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రతి తండా, గూడెంలో రోడ్లు వేసే బాధ్యత తమదని సిఎం తెలిపారు. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలన్నారు.1981లో జరిగిన ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పానని, ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగిందన్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా కెసిఆర్ పాలనను అంతం చేశామ న్నారు. అమరవీరుల ఆశయాలను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. చెప్పిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజ లు ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారన్నారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చర్యలు తీసుకుంటామని, అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేశారని, ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News