Tuesday, December 24, 2024

ఢిల్లీలో తెలు’గోడు’ వినేదెవరు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదని హెచ్చరించారు. పార్ట్ టైం రాజకీయ నాయకులు రావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృ ద్ధి సంస్థలో తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డి జిపి పిఎస్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్‌పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అ వుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరిని ఇక్కడ కలుసుకోవడం గొప్ప అనుభూతి కలిగించిందని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్‌టిఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వారి తరువాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని ఐతే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఢిల్లీకి వెళితే ఎవరిని కలువాలో, ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలు కనిపించడం లేదని అన్నారు. మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, జాతీ య రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో తెలుగు వారు ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

కేంద్ర కేబినెట్ లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిణామాలు వేధావులు ప్రస్తావించాలని మళ్ళీ తెలుగు వారంతా కలిసి రాణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం సూచనలు తీసుకుంటుంది. గతంలో నంద్యాలలో పివి పోటీ చేసినపుడు, తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్‌టిఆర్ పివిపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని అన్నారు. మా ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని, రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయడానికి మేం మా వంతు కృషి చేస్తామని, ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని ఆకాక్షించారు. జాతీయ అంశాలు వచ్చినపుడు ఎలాం టి ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినపుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విచక్షణ ఉండాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News