2020 కరోనా సంక్షోభంపై డబ్ల్యుహెచ్‌ఒ అంచనా
న్యూయార్క్ :2020 డిసెంబర్ 31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, వాస్తవానికి అంతకంటే కనీసం 12 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య గణాంకాల పేరుతో ప్రత్యేక నివేదికను డబ్ల్యుహెచ్‌వొ శుక్రవారం విడుదల చేసింది. చాలా దేశాల్లో కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో మరణించిన వారిని పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక మృతి చెందిన వారినే లెక్కించారు. వ్యాధి నిర్ధారణ సరిగ్గా జరగక ముందే కన్నుమూసిన వారిని లెక్కలోకి తీసుకోలేదు. కొవిడ్ సంక్షోభం పరోక్షంగా కూడా చాలా మరణాలకు దారి తీసింది. వాటిని గణించ లేదు. ఆదాయం, వయసు, జాతి తదితర అంశాల ప్రాతిపదికన సమాజంలో అసమానతలు ఇంకా ఉన్నాయని మహమ్మారి ఎత్తిచూపింది. మరోవైపు అన్ని దేశాలు డేటా సేకరణ సామర్ధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు.