Sunday, January 19, 2025

కృత్రిమ తీపితో క్యాన్సర్ ముప్పు… కూల్ డ్రింక్స్ తాగితే అంతే…

- Advertisement -
- Advertisement -

కూల్ డ్రింక్స్ తాగే వాళ్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) హెచ్చరిస్తోంది. శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్‌కు కారకమవుతుంది. ఆస్పర్టెమ్ అనే కృత్రిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో శీతల పానీయాల్లో వినియోగిస్తుంటారు. ఇది తక్కువ క్యాలరీలు ఉండే కృత్రిమ స్వీటెనర్. ఇది సుక్రోజ్ కంటే సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ చెబుతోంది. కోకాకోలా , డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ , కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తుల్లో ఆస్పర్టెమ్ వినియోగిస్తుంటారు.

ఆస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాల్ నైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో ఈ స్వీటెనర్‌ను తయారు చేస్తారు. ఆస్పార్టిక్ ఆమ్లం, ఫెనిలాల్‌నైన్ తోపాటు కొద్దిమొత్తంలో మిథనాల్ కూడా ఉంటుంది. 1965లో రసాయన శాస్త్రవేత్త జేమ్స్ ఎం. ష్లాటర్ ఆస్పర్టెమ్‌ను కనుగొన్నారు. కార్కొనేటెడ్ పానీయాల్లో తీపి రుచికి ప్రత్యామ్నాయంగా ఆస్పర్టెమ్‌ను వినియోగించడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( ఎఫ్‌డిఎ ) 1983 లో ఆమోదించింది. కూల్‌డ్రింక్స్‌లో మాత్రమే కాకుండా తృణ
ధాన్యాలు, చక్కెర లేని చూయింగ్ గమ్ , తక్కువ కేలరీల పండ్ల రసాలు, డైట్ సోడాలతో సహా పలురకాల ఆహారాలు, పానీయాలలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆస్పర్టెమ్‌ని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు.

కృత్రిమ స్వీటెనర్ వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్యసంస్థ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కృత్రిమ స్వీటెనర్ వినియోగం వల్ల బరువు తగ్గవచ్చని చాలా మంది భావిస్తున్నారని కానీ ఇది వాస్తవం కాదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా పండ్లలో సహజంగా ఉండే చక్కెరను తీసుకోవాలి. పండ్లు లేదా చక్కెర రహిత ఆహారాలు, పానీయాలు వంటివి సహజంగా లభించే చక్కెరలతో కూడినవి తీసుకోవాలి. కృత్రిమ స్వీటెనర్ ముఖ్యమైన ఆహార కారకం కాదని, ఇందులో పోషక విలువలంటూ ఏవీ ఉండవని పేర్కొంది. కృత్రిమ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ ముప్పు 95 శాతం ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఆస్పర్టెమ్ తోనే ఊబకాయం , ఎండోమెట్రియం, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 15 శాతం పెరుగుతున్నట్టు తేలింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దెబ్తతింటుంది. బరువు పెరుగుతారు. ఇన్‌ఫ్లెమేషన్‌కు దారి తీస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News