Monday, December 23, 2024

కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై డబ్లుహెచ్‌వొ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

WHO warns of 2nd Omicron recombinant virus XE

జెనీవా : మ్యుటేషన్ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) హెచ్చరించింది. ఇప్పటివరకు ఎక్స్‌డి, ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎఫ్ అనే మూడు హైబ్రిడ్ రకాలను గుర్తించినట్టు పేర్కొంది. ఇందులో ఎక్స్ ఈ స్ట్రెయిన్ (ఒమిక్రాన్ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్ స్ట్రెయిన్) లో 10 శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్టు పేర్కొంది. డెల్టా బిఎ1 కాంబినేషన్‌లో ఎక్స్‌డి, ఎక్స్ ఇ ఏర్పడగా, ఒమిక్రాన్ ఉపరకాల్లో మార్పుల వల్ల ఎక్స్ ఏర్పడినట్టు యూకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఎక్స్‌డి వేరియంట్ ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. వీటిలో స్పైక్ ప్రొటీన్ బిఎ 1 నుంచి కాగా మిగతా జన్యుక్రమం డెల్టా నుంచి వచ్చింది.

ఎక్స్‌ఎఫ్ వేరియంట్‌ను మొదట బ్రిటన్‌లో గుర్తించారు. బీఎ 1 నుంచి స్పైక్ ప్రొటీన్ రాగా, మరో ఐదో వంతు జన్యుక్రమం డెల్టా రకం నుంచి ఉన్నట్టు అంచనా. ఎక్స్ ఇ మాత్రం బిఎ 1, బిఎ2 ఉపరకాల వల్ల ఏర్పడింది. బిఎ 2 నుంచి స్పైక్ ప్రొటీన్ రాగా, మరో ఐదోవంతు బిఎ1 జన్యుక్రమంగా గుర్తించారు. జనవరి 19 న యూకెలో ఎక్స్ ఇ రీకాంబినాంట్ గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. అయితే ఈ మూడు హైబ్రిడ్ వేరియంట్లలో ఎక్స్‌ఇ, ఎక్స్ ఎఫ్ రకాలు మాతృవైరస్ మాదిరిగానే ప్రపర్తించే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ టామ్ పీకాక్ వెల్లడించారు. ఎక్స్ డి మాత్రమే కొంత ఆందోళనకరమైనదని, ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్, డెన్మార్క్ దేశాల్లో వెలుగు చూసిందన్నారు. అయితే వీటి ప్రభావాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News