Monday, January 20, 2025

వరంగల్ తూర్పులో టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తాం

- Advertisement -
- Advertisement -

వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ అజాంజాహి మిల్లులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో చేయడం వలన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. వరంగల్‌లోని అజాంజాహి మిల్లును గత పాలకుల నిర్లక్షం వలన మూతపడగా దాని స్థానంలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసి వరంగల్‌కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు రుణం వరంగల్ తీర్చుకోలేనిదన్నారు.

నా నలబై ఏండ్ల రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఒక విజన్‌తో రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని అదే క్రమంలో చేయడం వలన నేడు తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అడిగినన్ని నిధులు ఇచ్చి వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశారన్నారు. వరంగల్ కలెక్టరేట్ కోసం తనతో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌లు పట్టుబట్టి వరంగల్ జిల్లాను చేసే విధంగా పట్టుబట్టి వరంగల్ కలెక్టరేట్‌ను సాధించుకోవడం జరిగిందన్నారు.

ఈ గ్రౌండ్‌కు ఇంత చరిత్ర ఉందని, ఇక్కడే కలెక్టరేట్ నిర్మిస్తే బాగుండదని కార్మిక వాడలోనే కలెక్టరేట్ నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధ్ది చెందుతుందని సీఎంను ఒప్పించి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దీని వలన వరంగల్‌కు ఎక్కడా లేని వెలుగు వచ్చిందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించి చేతుల్లో పెడుతామని మంత్రి దయాకర్‌రావు మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News