Sunday, December 22, 2024

మైనస్‌లో టోకు ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణంపై పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం తర్వాత అక్టోబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. గత నెలలో టోకు ద్రవ్యోల్బణం వరుసగా ఏడో నెలలో సున్నా కంటే దిగువనే ఉంది. ఆహార వస్తువుల ధరలు దిగిరావడంతో అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.52 శాతం నమోదైంది. డబ్లుపిఐ (టోకు ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెల నుంచి నెగెటివ్ జోన్‌లో నమోదవుతోంది, 2023 సెప్టెంబర్‌లో ఇది మైనస్ 0.26 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 8.67 శాతంగా ఉంది. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటు -0.52 శాతం అంటే మైనస్ 0.52 శాతం నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News